: ఆ కుక్కలను కాల్చి చంపండి... గుంటూరు కలెక్టర్ కు మంత్రి ప్రత్తిపాటి ఆదేశం


గుంటూరు జిల్లా కాకుమాను ముస్లిం కాలనీలో వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల చిన్నారి షేకే కౌసరా ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రంగా స్పందించారు. పాపపై దాడి చేసిన కుక్కలను తక్షణం కాల్చి చంపాలని గుంటూరు కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాప కుటుంబాన్ని ఆదుకుంటామని, ఎటువంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ ఉదయం 10 వీధి కుక్కలు ఒక్కసారిగా కౌసరాపై దాడి చేయగా, తీవ్ర గాయాలపాలై ఆ బాలిక మృతి చెందిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News