: పరుగులు పెట్టిన కేటీర్, ఈటల
తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ తేనెటీగల ధాటికి పరుగులు పెట్టారు. కరీంనగర్ జిల్లాలో కురిసిన వడగండ్ల వానకు నాశనమైన పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేటీఆర్, ఈటల స్థానిక నేతలతో పంటపొలాలకు వెళ్లారు. పంట నష్టాన్ని పరిశీలించిన అనంతరం వెనుదిరిగారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఓ గుంపు తేనెటీగలు ఒక్కసారిగా వారిపై బడ్డాయి. దీంతో మంత్రులు, స్థానిక నేతలు పరుగందుకున్నారు. కేటీఆర్, ఈటల కార్లలో దూరి తలుపులు వేసుకోగా, ఇతరులు పరుగులంకించుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం విశేషం.