: ప్రేమించలేదని కారుతో ఢీకొట్టిన ప్రేమోన్మాది
సంవత్సర కాలంగా తన ప్రేమను పట్టించుకోవడం లేదనే అక్కసుతో ఒక ప్రేమోన్మాది యువతిని కారుతో ఢీకొట్టి, అడ్డొచ్చిన మరో ఐదుగురిపైనా ఎక్కించేశాడు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు షెబీన్ (21) గత కొంత కాలంగా బీకాం రెండవ సంవత్సరం చదువుతున్న యువతి వెంట పడ్డాడు. అరింబూర్ లోని ఒక ప్రార్థనా మందిరానికి వెళ్లి వస్తున్న ఆమెను కారుతో ఎటాక్ చేశాడు. ఆమెకు సహాయపడేందుకు యత్నించిన మరో ఐదుగురిని కూడా ఢీకొట్టాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. మిగతా ఐదుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం షెబీన్ కారును వదలి తల్లిదండ్రులు సహా పరారయ్యాడు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసినట్టు పోలీసులు తెలిపారు.