: 'సమాజ్ వాదీ జనతా పార్టీ'గా జనతా పరివార్


ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఆరు పార్టీలు కలసి తీసుకొస్తున్న కొత్త ఫ్రంట్ 'జనతా పరివార్' ఎట్టకేలకు ఖారారైంది. ఇక నుంచి దాన్ని 'సమాజ్ వాదీ జనతా పార్టీ'గా పిలవనున్నారు. దానిపై ఎస్పీ అధ్యక్షుడు ములాయం అధికారికంగా ప్రకటించనున్నారు. నితీష్ కుమార్ జనతా దళ్ (యునైటెడ్), లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ, ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ, ఓం ప్రకాశ్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్ దళ్, మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడ జనతా దళ్ (సెక్యులర్) పార్టీ, సమాజ్ వాదీ జనతా పార్టీలు ఈ ఫ్రంట్ లో ఉంటాయి. ఎస్పీ అధినేత ములాయం సింగ్ ఈ కొత్త ఫ్రంట్ కు అధ్యక్షుడిగా ఉంటారు. అంతేగాక ఎస్పీ చిహ్నమైన సైకిల్, ఎరుపు, ఆకుపచ్చ రంగున్న జెండాను కొత్త ఫ్రంట్ కు తీసుకున్నారు. ఇదిలాఉంటే, వచ్చే ఏడాది బీహార్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన ఫ్రంట్ తరపున నితీష్ కుమార్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ ఫ్రంట్ కు లోక్ సభలో ములాయం, రాజ్యసభలో శరద్ యాద్ నేతృత్వం వహిస్తారు.

  • Loading...

More Telugu News