: రైడర్స్ పై సూపర్ కింగ్స్ జయభేరి
నేటి సాయంత్రం కోల్ కత ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో కోల్ కత నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయబావుటా ఎగురవేసింది. ఓపెనర్ హసీ 40 పరుగులు చేయగా, చివర్లో జడేజా 36 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. జడేజా కేవలం 14 బంతుల్లోనే 3 సిక్సర్లు, 3 ఫోర్లతో ఈ పరుగులు చేయడం విశేషం.