: మహారాష్ట్ర ఉపఎన్నికల్లో ఎన్సీపీ, శివసేన అభ్యర్థుల జయకేతనం


మహారాష్ట్ర శాసనసభ ఉపఎన్నికల్లో ఎన్సీపీ, శివసేన అభ్యర్థులు విజయం సాధించారు. తస్గావ్-కవాతే మహాకాల్ నియోజకవర్గానికి పోటీ చేసిన ఎన్సీపీ అభ్యర్థి, దివంగత ఆర్.ఆర్.పాటిల్ సతీమణి సుమన్ పాటిల్ గెలుపొందారు. 1.12 లక్షల ఓట్ల ఆధిక్యంతో బీజేపీ రెబల్, స్వతంత్ర అభ్యర్థి అయిన స్వప్నిల్ పాటిల్ పై జయకేతనం ఎగురవేశారు. ఇక ముంబయిలోని బాంద్రా తూర్పు నియోజకవర్గ ఉపఎన్నికలో శివసేన అభ్యర్థి తృప్తి సావంత్... కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ రాణేపై గెలుపొందారు. సేన అభ్యర్థికి 52,711 ఓట్లు, కాంగ్రెస్ కు 33,703, ఎంఐఎంకు 15,050 ఓట్లు దక్కాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంకన్ నుంచి పోటీ చేసిన రాణే అక్కడ కూడా పరాజయం పాలయ్యారు.

  • Loading...

More Telugu News