: ఇళ్లు కాపాడుకునేందుకు ముస్లిం మతంలోకి మారిన 800 మంది హిందువులు!


ఉత్తరప్రదేశ్ మంత్రి అజాంఖాన్ కన్ను తమ ఇళ్ళపై పడిందని, ఆయన షాపింగ్ మాల్స్, వర్తక సముదాయాలు నిర్మించేందుకు వాల్మీకి కులానికి చెందిన వారు నివసిస్తున్న ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ, ఆయనను ప్రసన్నం చేసుకోవాలంటే మతం మారక తప్పదని 800 మంది నిర్ణయించుకున్నారు. అంబేద్కర్ జయంతి రోజున (నిన్న) ఉత్తరప్రదేశ్ లో ముస్లిం పెద్దల సమక్షంలో మత మార్పిడి కార్యక్రమం జరిగింది. వారు ఉంటున్న స్థలం ప్రభుత్వానిదని, వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తూ, గత వారం ఆ ఇళ్లకు రెడ్ మార్క్ వేశారు. దీంతో వారంతా భయాందోళనలకు గురికాగా, కొందరు మత మార్పిడి సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదలను భయపెట్టి మత మార్పిడులను అజాంఖాన్ ప్రోత్సహిస్తున్నారని పలువురు రాజకీయ నేతలు దుయ్యబట్టారు. కాగా, అలా చేసినంత మాత్రాన ప్రభుత్వ నిర్ణయాలు మారవని, ప్రభుత్వం కచ్చితంగా స్థలం స్వాధీనం చేసుకుంటుందని అజాంఖాన్ సన్నిహితుడొకరు తెలిపారు.

  • Loading...

More Telugu News