: చర్లపల్లిలో ఖైదీల టీ20 మ్యాచ్... మ్యాచ్ కు దూరంగా ‘సత్యం’ దోషులు!


ఖైదీల అంతర్జాతీయ క్రీడోత్సవాలను పురస్కరించుకుని నిన్న చర్లపల్లి జైల్లో ఖైదీల మధ్య ఆటల పోటీలు జరిగాయి. క్రీడల్లో భాగంగా ఖైదీలు టీ20 క్రికెట్ మ్యాచ్ ఆడారు. చర్లపల్లి, వరంగల్ జైలు ఖైదీల జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో వరంగల్ జట్టు విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యచ్ ను జైల్లోని మొత్తం 943 మంది ఖైదీలు ఆసక్తిగా వీక్షించారు. అయితే సత్యం కంప్యూటర్స్ కేసులో దోషులుగా తేలి ఇటీవలే జైలుకు వెళ్లిన రామలింగరాజు అండ్ కో మాత్రం ఈ మ్యాచ్ ను చేసేందుకు బయటకు రాలేదట. తమకు కేటాయించిన బ్యారక్ లకే పరిమితమయ్యారట.

  • Loading...

More Telugu News