: 'ఇంజనీరింగ్' మా వల్ల కాదు!: 42 వేల సీట్ల రద్దు కోరుతూ కాలేజీల దరఖాస్తు
తెలంగాణలో ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సీటు సంపాదించడం మరింత కష్టం కానుంది. యాజమాన్య కోటాతో పాటు ర్యాంకర్లకూ సీట్లు తగ్గిపోనున్నాయి. ఇంజనీరింగ్ విద్యను బోధించడం తమ వల్ల కాదని 213 కాలేజీలు 42 వేల సీట్ల రద్దుకు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు కారణం. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీలపై చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో 13 కాలేజీలు పూర్తిగా మూసివేసేందుకు దరఖాస్తు చేయగా, 200 కాలేజీలు ఇంజనీరింగ్ సీట్లు తమకు వద్దని తేల్చి చెప్పాయి. ఈ కాలేజీల దరఖాస్తులను ఆమోదిస్తున్నట్టు హైదరాబాద్ జేఎన్‌టీయూ తెలిపింది.