: పట్టిసీమ వద్దు... పోలవరం ముద్దు: నేటి నుంచే జగన్ బస్సు యాత్ర!


పట్టిసీమ ప్రాజెక్టు రద్దు కోసం పోరును కొనసాగించేందుకే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ‘పట్టిసీమ వద్దు...పోలవరం ముద్దు’ అంటూ ఆయన చేపట్టనున్న బస్సు యాత్ర నేడు ప్రారంభం కానుంది. రాయలసీమ సాగు, తాగు నీటి అవసరాలను తీర్చనున్న ఈ ప్రాజెక్టుపై ఓ వైపు సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు సానుకూలంగా ఉన్నా, జగన్ మాత్రం ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగానే ముందుకెళ్లేందుకు నిర్ణయించుకోవడం గమనార్హం. నేడు ప్రారంభం కానున్న యాత్రలో భాగంగా ఆయన నేటి ఉదయం హైదరాబాదు నుంచి విమానంలో నేరుగా రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా ధవళేశ్వరం చేరుకుని అక్కడ కాటన్ దొరతో పాటు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నివాళులర్పిస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత పట్టిసీమ ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్నీ ఆయన సందర్శిస్తారు. పట్టిసీమ రేవులోనే ఆయన రైతులతో ముఖాముఖీ నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా ఆయన రేపు కృష్ణా బ్యారేజీతో పాటు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు, కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులను కూడా సందర్శిస్తారు.

  • Loading...

More Telugu News