: ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం... మరో విమానాన్ని పంపిన ఎయిర్ ఇండియా!
ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. మూడు దేశాల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీకి ఏర్పాటు చేసిన ఆ సంస్థకు చెందిన ‘ఎయిర్ ఇండియా వన్’ బోయింగ్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. నిన్న జర్మనీ పర్యటనను ముగించుకున్న ప్రధాని బెర్లిన్ నుంచి కెనడా వెళ్లాల్సి ఉంది. సరిగ్గా అప్పటికి కాస్త ముందుగా ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అక్కడి విమాన సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు అప్పటికే సిద్ధంగా ఉంచిన మరో విమానాన్ని హుటాహుటిన బెర్లిన్ తరలించారు. ఈ విమానంలోనే మోదీ బెర్లిన్ నుంచి కెనడా బయలుదేరారు. కెనడాలో పర్యటన ముగించుకున్న తర్వాత మోదీ ఈ నెల 18న ఇదే విమానంలో భారత్ తిరిగి వస్తారు.