: తెలంగాణ సర్కారు ప్రోత్సాహం నాలో ధైర్యాన్ని నింపింది: సానియా మీర్జా


టెన్నిస్ డబుల్స్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకునేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహమే కారణమని హైదరాబాదీ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం తనలో ధైర్యాన్ని నింపిందని, దాంతోనే చెలరేగి ఆడి టెన్నిస్ డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ ను చేజిక్కించుకున్నానని ఆమె కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించింది. డబుల్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న తర్వాత తొలిసారిగా హైదరాబాదు వచ్చిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సానియా పేర్కొంది.

  • Loading...

More Telugu News