: రేపే ‘మహా కూటమి’ ఆవిర్భావం... ములాయం నేతృత్వంలో ఏకం కానున్న ఆరు పార్టీలు!


బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం తామేనని ప్రకటించుకున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లు రేపు కొత్త కూటమికి తెర లేపుతున్నారు. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ ఏకీకరణలో మొత్తం ఆరు పార్టీలు చేతులు కలపనున్నాయి. సమాజ్ వాదీ జనతా పార్టీ, సమాజ్ వాదీ జనతా దళ్ ల పేర్లలో ఒకదానిపై తెరంగేట్రం చేయనున్న ఈ కూటమి ఆవిర్భావాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ములాయం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి జేడీ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు జేడీ (యూ) నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లతో పాటు ఐఎన్ ఎల్డీ ప్రముఖ నేతలు సహా అతిరథ మహారథులు హాజరుకానున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న సమాజ్ వాదీ జనతా దళ్ పార్టీ కి సైకిల్ గుర్తునే కేటాయించాలని ములాయం, లాలూ ఎన్నికల సంఘానికి విన్నవించనున్నారని విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News