: ఇక వారానికి మూడు రోజులు బెజవాడలోనే చంద్రబాబు...వేగంగా క్యాంపు ఆఫీసు పనులు
వచ్చే నెల నుంచి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వారానికి మూడు రోజులు విజయవాడలో ఉండనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి రాజధాని లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాదు నుంచే పాలనను సాగిస్తున్న ఆయన, వీలయినంత త్వరగా ఏపీ నుంచే పాలన సాగించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంఓ ఆదేశాలతో విజయవాడలోని సాగునీటి శాఖ కార్యాలయం సీఎం క్యాంపు ఆఫీసుగా మారుతోంది. ప్రస్తుతం అక్కడ క్యాంపు ఆఫీసు పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే నెల తొలి వారంలోనే క్యాంపు ఆఫీసును ప్రారంభించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. బెజవాడలో క్యాంపు ఆఫీసు ప్రారంభించిన తర్వాత వారానికి మూడు రోజులు అక్కడే ఉండనున్న చంద్రబాబు, మిగిలిన నాలుగు రోజుల్లో ఓ రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పర్యటనకు వెళ్లి, మూడు రోజులు మాత్రమే హైదరాబాదులో ఉండనున్నారు.