: కోల్ కతాలో బీజేపీ నేత రూపా గంగూలీపై దాడి... తృణమూల్ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు


పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, విపక్ష బీజేపీల మధ్య దూరం మరింత పెరుగుతోంది. రెండు పార్టీల మధ్య విభేదాలు మాటలు దాటి దాడులు చేసుకునే దాకా వెళ్లాయి. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీలు బాహాబాహికి దిగాయి. ఈ క్రమంలో నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రముఖ నటి, బీజేపీ నేత రూపా గంగూలీపై దాడి జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో కోల్ కతాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News