: రాహుల్ అసమర్థుడని నేనేనాడు అనలేదు... సోనియా నాయకత్వమే కొనసాగాలి: షీలా దీక్షిత్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్... గాంధీ కుటుంబం, పార్టీ నాయకత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని తాను ఏనాడు అసమర్థుడని పేర్కొనలేదని ఆమె చెప్పారు. అసలు తాను రాహుల్ పేరునే ప్రస్తావించలేదని చెప్పిన ఆమె, పార్టీ నాయకత్వ పగ్గాలు మాత్రం సోనియా గాంధీ చేతుల్లోనే ఉండాలని తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. సోనియా నాయకత్వం కొనసాగాలని చెబుతూనే, రాహుల్ ను అసమర్థుడని తాను వ్యాఖ్యానించలేదని ఆమె పేర్కొనడంతో పార్టీ వర్గాల్లో అయోమయం నెలకొంది. అసలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని షీలా స్వాగతిస్తున్నారా? లేక తిరస్కరిస్తున్నారా? అనే అంశంపై స్పష్టత లేక ఆ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.