: జర్మనీ పెట్టుబడులతో మేకిన్ ఇండియాకు కొత్త జవసత్వాలు: బెర్లిన్ లో ప్రధాని మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ పర్యటన ముగిసింది. కొద్దిసేపటి క్రితం జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఆ దేశ సైనిక గౌరవ వందనం స్వీకరించిన ఆయన కెనడా పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్మనీ సహకారంపై హర్షం ప్రకటించారు. జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ ఆత్మీయ ఆహ్వానం తనను అబ్బురపరచిందన్నారు. జర్మనీ, భారత్ సంబంధాలపై తామిద్దరం మనసు విప్పి మాట్లాడుకున్నామన్నారు. మేకిన్ ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. అభివృద్ధిలో పెట్టుబడులు కీలకమని వ్యాఖ్యానించిన ఆయన, జర్మనీ పెట్టుబడులతో మేకిన్ ఇండియాకు కొత్త జవసత్వాలు వస్తాయని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News