: రాజధాని రైతులతో అభివృద్ధి ఒప్పందం... మే 1లోగా పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు
ఏపీ రాజధాని కోసం భూములిచ్చే రైతులకు ప్రతి ఏటా మే 1లోగా పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వార్షిక మొత్తాన్ని చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్ డీఏతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులందరికీ మే 1 లోగా చెల్లింపులు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో రాజధాని భూ సమీకరణలో భూములిచ్చే రైతుల నుంచి అభివృద్ధి ఒప్పందం చేసుకోనుంది. 9.14ఏ నమూనా ప్రకారం ప్రభుత్వం ఈ అభివృద్ధి ఒప్పందం చేసుకోనుంది.