: యాక్టివేషన్ లోకి ఆర్ బీఐ ట్విట్టర్ ఖాతా
సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా చేరువయ్యేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. తన కొత్త వ్యూహంలో భాగంగా @rbi_official పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాను సెంట్రల్ బ్యాంక్ మళ్లీ రీయాక్టివేట్ చేసింది. అంతేగాక తమ ప్రెస్ కాన్ఫరెన్సులు, ఇంటర్వ్యూలు, టౌన్ హాల్ మీటింగులు, ఇతర కార్యక్రమాలన్నింటినీ వీడియో తీసి యూట్యూబ్ లో పెడతామని ఆర్ బీఐ తెలిపింది. దాంతోపాటు ఆర్థిక నిరక్షరాస్యత లక్ష్యంగా డాక్యుమెంటరీలు రూపొందించి యూట్యూబ్ లో పెట్టనున్నట్టు వెల్లడించింది. అంతేగాక ఆర్ బీఐ సవరించే వడ్డీ రేట్లను కూడా ఎప్పటికప్పుడు ట్విట్టర్ ఖాతాలో అప్ డేట్ చేస్తారు.