: బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల కంటే... గుడ్లే ప్రమాదకరం: హై అలర్ట్ ప్రకటించిన పశు సంవర్ధక శాఖ


బర్డ్ ఫ్లూ వ్యాధిపై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. వ్యాధి తీవ్రత, నివారణ చర్యలు తదితరాలపై మీడియా ద్వారా పశు సంవర్ధక శాఖ సవివర ప్రకటనను విడుదల చేసింది. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన కోళ్ల కంటే కోడిగుడ్లు మరీ ప్రమాదకరమని ఆ ప్రకటనలో హెచ్చరించింది. చికెన్ తో పాటు గుడ్లకూ కొంతకాలం పాటు దూరంగా ఉంటేనే మంచిదని సూచించింది. కోడిగుడ్లను తప్పనిసరిగా తినాల్సి వస్తే, ఉడికించిన గుడ్లనే తినాలని కూడా సలహా ఇచ్చింది. ఇక ఎక్కడైనా బర్డ్ ఫ్లూ ఉన్నట్లు తెలిస్తే వెనువెంటనే సమాచారం అందించాలని కోరింది. ఈ ఫిర్యాదులపై స్పందించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను రంగంలోకి దింపినట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News