: అకాల వర్షంతో అతలాకుతలం... రూ.1,000 కోట్ల సాయమివ్వండి: కేంద్రానికి యూపీ సీఎం లేఖ


ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కేంద్రం శరణుజొచ్చారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో అతలాకుతలమయ్యామని పేర్కొన్న ఆయన, తమను ఆదుకునేందుకు కేంద్రం చొరవ చూపాలని కోరారు. ఈ మేరకు నేడు ఆయన కేంద్రానికి ఓ లేఖ రాశారు. అకాల వర్షంతో చితికిపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించేందుకు రూ.1,000 కోట్ల సాయాన్ని అందించాలని ఆయన కేంద్రాన్ని ఆ లేఖలో కోరారు. ఇక రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా జరిగిన నష్టానికి సంబంధించిన నివేదికను కూడా ఆయన ఆ లేఖకు జతచేసి మరీ పంపారు.

  • Loading...

More Telugu News