: నిన్న హత్యలు... నేడు కిడ్నాపులు:కొనసాగుతున్న మావోయిస్టుల దాడుల పర్వం
మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. గడచిన రెండు రోజుల్లో ఛత్తీస్ గఢ్ లో బాంబులతో విరుచుకుపడ్డ మావోలు పెద్ద సంఖ్యలో పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. తాజాగా నేటి ఉదయం ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో పంజా విసిరిన మావోలు ఏడుగురు వ్యక్తులను కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై పూర్తి స్థాయి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మావోయిస్టుల వరుస దాడుల నేపథ్యంలో ఒఢిశా సర్కారు అప్రమత్తమైంది. పోలీసులను అలర్ట్ చేసింది. సర్కారు హెచ్చరికలతో మావోయిస్టు ప్రభావిత జిల్లాలో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు.