: ఎర్రచందనం అక్రమ రవాణాలో తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు...ఏపీ సీఐడీ వద్ద ఆధారాలు?


తిరుమలేశుడి ఏడుకొండలు కొలువై ఉన్న శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనాన్ని అక్రమ మార్గాల్లో దేశ సరిహద్దులు దాటిస్తున్న అక్రమ దందాలో తమిళనాడుకు చెందిన రాజకీయ ప్రముఖులతో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి ఏపీ పోలీసులు పలు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో 20 మంది ఎర్ర కూలీలు చనిపోయిన నేపథ్యంలో తమిళనాడు, ఏపీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో అసలు వాస్తవాలను వెలికితీసేందుకు ఏపీ సర్కారు అనుమతితో రంగంలోకి దిగిన సీబీసీఐడీ పోలీసులు తమిళనాడులో ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా తమిళనాడుకు చెందిన ఓ కార్పొరేట్ ఆస్పత్రి డైరెక్టర్ తో పాటు ఇద్దరు తమిళ సినీ రంగ నిర్మాతలు, డీఎంకేకు చెందిన కీలక నేత తదితరుల ప్రమేయానికి సంబంధించి కీలక ఆధారాలను సేకరించారని తెలుస్తోంది. అయితే తమకు అందిన సమాచారాన్ని మరోమారు రూఢీ చేసుకునే క్రమంలో పోలీసులు చెన్నై సహా, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విచారణ సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News