: ఇదేమి వర్షం? నేలకూలిన విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, ఇళ్ళలోకి నీరు!
అకాల వర్షాలకు రైతులతో పాటు సాధారణ ప్రజా జీవనం అతలాకుతలం అయింది. ఇదేమి వర్షం దేవుడా? అంటూ ప్రజలు గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. గత మూడు రోజులుగా ఉపరితల ద్రోణి ప్రభావంతో పడుతున్న వర్షాలకు డ్రైనేజ్ వ్యవస్థ పనితీరు సరిగా పనిచేయక లోతట్టు ప్రాంతాల ఇళ్ళలోకి నీరు చేరింది. హైదరాబాదులోని బేగంపేట, బీకే గూడ, వారాసి గూడ, మహమ్మద్ కుంట తదితర ప్రాంతాల్లో నడుము లోతు నీరు నిలిచింది. పలు చోట్ల ఇళ్ళల్లోకి నీరు చేరింది. ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. హోర్డింగులు కూలాయి. వాహనాలు ధ్వంసం అయ్యాయి. వర్షాల కారణంగా తెలంగాణాలో ఇప్పటివరకూ ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది.