: అరకిలో బరువున్న వడగళ్ళ వానతో హైదరాబాద్ అస్తవ్యస్తం... పలు వాహనాలు ధ్వంసం


భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అయింది. గత రాత్రి పలు ప్రాంతాల్లో అరకిలో వరకూ బరువైన వడగళ్ళతో కూడిన వర్షం పడింది. ముఖ్యంగా కూకట్ పల్లి, మాదాపూర్ ప్రాంతంలో ఈదురుగాలులకు పలు చెట్లు కూలిపోగా, పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట, అమీర్‌ పేట్, ఖైరతాబాద్, దిల్ సుఖ్‌ నగర్, కోఠి, మలక్‌ పేట్, సనత్‌ నగర్, జూబ్లీ హిల్స్ సికింద్రాబాద్, వనస్థలిపురం, హయత్‌ నగర్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News