: 'సంక్షేమ యాత్ర' పేరిట ఇక చినబాబు ఓదార్పు!
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ నేటి నుంచి 'కార్యకర్తల సంక్షేమ యాత్ర'కు శ్రీకారం చుట్టనున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ యాత్రను చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ ఓదార్పు యాత్రకు దీటుగా దీన్ని నిర్వహించి విజయవంతం చేయాలని స్థానిక నేతలకు ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదవశాత్తు మరణించిన దేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి రూ. 2 లక్షల పరిహారాన్ని ఆయన అందించనున్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి ఇటీవల వివిధ కారణాలతో మరణించిన మొత్తం 49మంది టీడీపీ క్రియాశీలక కార్యకర్తల బంధువులను లోకేష్ కలవనున్నారు.