: రాణించిన సన్ రైజర్స్ బౌలర్లు... 19.5 ఓవర్లలో ఆలౌటైన బెంగళూరు!


బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు బౌలర్లు రాణించారు. సిక్సర్ల హీరో క్రిస్ గేల్(21) తో పాటు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ(41)ని కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చారు. ముఖ్యంగా రవి బొపారా విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేయడమే కాక, మరో వికెట్ తీసి చాలెంజర్స్ భారీ స్కోరుకు అడ్డుకట్ట వేశాడు. ఇక బ్యాట్ ఝుళిపిస్తాడనుకున్న దినేశ్ కార్తీక్ (9) కూడా రాయల్ చాలెంజర్స్ ను నిరాశపరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ (46) బెంగళూరు జట్టును ఆదుకున్నాడు. భారీ షాట్లతో సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే 19 ఓవర్ లో అతడు కూడా ఔటయ్యాడు. దూకుడుగా ఆడుతున్న అతడిని సన్ రైజర్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఔట్ చేశాడు. డివిలియర్స్ ఔటైన తర్వాత వెంటవెంటనే వికెట్లు పడ్డాయి. కేవలం రెండు ఓవర్ల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయిన బెంగళూరు 19.5 ఓవర్లలో ఆలౌటైంది. దీంతో 166 పరుగుల స్వల్ప స్కోరుకే బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. మరికాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాదు 167 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగనుంది.

  • Loading...

More Telugu News