: బీజేపీ, వైసీపీల్లో చేరే ప్రసక్తే లేదు: పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ


బీజేపీ, వైసీపీల్లో తాను చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్న ఆయన... బీజేపీ, వైసీపీల్లో చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ మారాలన్న యోచనే తనకు లేదనీ ఆయన వెల్లడించారు. అసలు ఈ తరహా పుకార్లు ఎందుకు పుడతాయో కూడా తనకు అర్థం కావడం లేదని బొత్స వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరుతున్నారని, ఆ తర్వాత తాజాగా వైసీపీలో చేరేందుకు బొత్స సన్నాహాలు చేసుకుంటున్నారని మీడియాలో పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News