: కుటుంబ నియంత్రణ పాటించని వారి ఓటు హక్కు తీసేయాలి: బీజేపీ ఎంపీ


వివాదాస్పద ప్రకటనలు చేయడంలో దిట్టయిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ తాజాగా, పెరిగిపోతున్న జనాభాను నియంత్రించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, ఆ చట్టాన్ని అనుసరించని వారి ఓటు హక్కు తీసేయాలని నిష్కర్షగా చెబుతున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, "హిందువులు కుటుంబ నియంత్రణలో భాగంగా వేసక్టమీ, ట్యుబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటారు. ముస్లింలు కూడా దానినే ఎంచుకోవాలి. ఈ విషయంలో అందరికీ ఒకే చట్టం ఉండాలి" అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అన్నారు. ప్రస్తుతం జనాభా పెరుగుదలే దేశం ముందున్న అతి పెద్ద సవాల్ అని నొక్కి చెప్పారు. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ జనాభా 30 కోట్లని, ఇప్పుడు 130 కోట్లనీ అన్నారు. దానికెవరు బాధ్యులు? అని మహారాజ్ ప్రశ్నించారు. ప్రతి ఒక్క హిందూ మహిళ నలుగురు పిల్లలను కనాలంటూ ఆమధ్య సెలవిచ్చిన ఆయనే ఇప్పుడిలా మాట్లాడటం ఆశ్చర్యకరం!

  • Loading...

More Telugu News