: ‘మా’ ఎన్నికలపై ఎడతెగని ఉత్కంఠ... తీర్పును 15కు వాయిదా వేసిన కోర్టు
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' (మా) ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. రెండు వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు ప్రత్యక్ష రాజకీయ ఎన్నికలను తలపించేలా హోరాహోరీగా సాగాయి. అప్పటికే ఈ వివాదం కోర్టులకెక్కిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ, ఫలితాల వెల్లడిపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఈ వివాదంపై పలుమార్లు విచారణ చేపట్టిన కోర్టు, నేటితో విచారణ పూర్తయినట్టు ప్రకటించింది. అయితే తీర్పు వెల్లడిని ఈ నెల 15కు వాయిదా వేసింది. దీంతో ఈ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ మరో మూడు రోజుల పాటు కొనసాగనుంది.