: తెలంగాణలో అకాల వర్షాల మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పడిన అకాల వర్షాల కారణంగా పలువురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బాధితులకు వెంటనే ఈ సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా అకాల వర్షాల నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని చెప్పారు. అకాల వర్షాలపై కేసీఆర్ సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలోనే పై నిర్ణయాలు తీసుకున్నారు.