: హైదరాబాద్, రంగారెడ్డిలో టీఆర్ఎస్ బలహీనమే!: తుమ్మల
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి బలహీనంగా ఉందని, అందువల్లే ఎంఎల్ సీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. ప్రణాళికా లోపం వల్ల కూడా ఓడిపోవాల్సి వచ్చిందని విశ్లేషించారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలోని రహదార్లను గుజరాత్ కన్నా మంచిగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నామని, అందులో భాగంగా, బాసర నుంచి భద్రాచలం వరకు రోడ్లు, భక్తులకు వసతిగృహాలు, ఇతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు వివరించారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు.