: బాబూ... మీ సంస్కరణలు బాగా నచ్చాయి: ఏపీ సీఎంకు చైనా ఉప ప్రధాని ప్రశంసలు!


టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిజంగా గ్లోబల్ లీడరే. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో ఆయన చేపట్టిన చర్యలు ప్రపంచ దేశాధినేతల ప్రశంసలు అందుకున్నాయి. కొన్ని దేశాల్లోని మీడియా ఆయనను ‘సీఈఓ’గానూ అభివర్ణించింది. పదేళ్ల తర్వాత మరోమారు ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనపై అగ్రదేశాల అధినేతలు మునుపటిలాగే ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు, కొద్దిసేపటి క్రితం ఆ దేశ ఉప ప్రధాని వాంగ్ యాంగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాంగ్ యాంగ్, మన సి.ఎం. తెస్తున్న సంస్కరణలపై ఉపప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సంస్కరణలు తమకు ఎంతగానో నచ్చాయని వాంగ్ యాంగ్ అన్నారు. చంద్రబాబు పర్యటనతో ఏపీపైనే కాక భారత్ పట్ల కూడా తమకు మరింత అవగాహన వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News