: బోర్డు తిప్పేసిన 'ఓషన్ మీడియా'
అధిక జీతాలతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి సుమారు రూ. 2 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఓ ఐటీ కంపెనీ, బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వెలుగులోకి వచ్చింది. ఓషన్ మీడియా ఐటీ సొల్యూషన్ పేరిట కంపెనీ పెట్టిన ఓ ప్రబుద్ధుడు 200 మంది నుంచి లక్ష రూపాయల చొప్పున వసూలు చేశాడు. ఆ డబ్బుతో పరారయ్యాడు. దీంతో ఆందోళన చెందిన బాధితులు కోటిపల్లి బస్టాండ్ దగ్గరున్న ఓషన్ మీడియా ఆఫీసు వద్ద ఆందోళన చేపట్టారు. వీరిచ్చిన ఫిర్యాదు మేరకు రాజమండ్రి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.