: అందరితో చర్చలు జరిపాకే భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణం: అశోక్ గజపతిరాజు
విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయ నిర్మాణం వివాదంపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. అక్కడి స్థానిక రైతులు, నిర్వాసితులతో సంప్రదింపులు జరిపిన తరువాతే విమానాశ్రయ నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. భవిష్యత్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరించాలని కోరారు. దేశ ప్రయోజనాల కోసమే జిల్లాలోని భోగాపురం విమానాశ్రయ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయడం ఖాయమని మరోవైపు మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. భూసేకరణను ఎవరూ అడ్డుకోలేరని, అడ్డుకోవాలని చూసినా నిర్మాణం ఆగదని అన్నారు.