: ఇండియాకు యుద్ధ విమానాలు ఇద్దామా? వద్దా?: మంత్రుల సలహా కోరనున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు


నిన్న కాక మొన్న భారత్ కు రఫాలే యుద్ధ విమానాలు విక్రయించేందుకు ఒప్పందం కుదిరిందని చెప్పిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండే వెనకడుగు వేశారు. ఇండియా కోరినట్టుగా విమానాలను విక్రయించాలా? వద్దా? అని ఫ్రాన్స్ మంత్రులను అడగనున్నారు. సుమారు 5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 32 వేల కోట్లు) విలువైన డీల్ కుదుర్చుకునే విషయమై సహచరులతో నేడు జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో చేర్చించనున్నారు. ఈ సమావేశానికి దస్సాల్ట్ ఏవియేషన్ అధికారులకు కూడా పిలుపు వెళ్ళింది. తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు అధికారుల సలహా అడగాలని భావించిన మీదటే హొలాండే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. కాగా, మొత్తం 36 రఫాలే విమానాలు సాధ్యమైనంత త్వరలో భారత వాయుసేన అమ్ములపొదిలోకి వస్తాయని ఫ్రాన్స్ లో ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News