: జీహెచ్ఎంసీ ఎన్నికలపై విచారణ వాయిదా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. వార్డులను విభజించి రెండొందలకు పెంచామని, వార్డుల పునర్ వ్యవస్థీకరణ ప్రకటన కూడా విడుదల చేశామని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. దానికి సంబంధించిన నివేదికను త్వరలో కోర్టుకు అందజేస్తామని చెప్పారు. తరువాత కోర్టు విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. మరోవైపు చెస్ట్ ఆసుపత్రి తరలింపుపైన కోర్టు విచారణ జరిగింది. దానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని పురావస్తు శాఖను ఆదేశించింది.