: మూడు రోజుల్లో మూడోసారి... మళ్లీ తెగబడ్డ మావోలు... కాల్పుల్లో జవాను మృతి
మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. చత్తీస్ ఘడ్ లోని కాంకేడ్ జిల్లాలో ఒకవైపు కూంబింగ్ జరుగుతుండగా, ఈ తెల్లవారుఝామున బిఎస్ఎఫ్ క్యాంప్ పై మావోలు దాడి చేశారు. కాల్పులతో విరుచుకుపడ్డారు. మావోలు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరుగగా, ఒక హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మావోయిస్టులు సంఘటనా స్థలం నుంచి తప్పించుకున్నారని ఎస్పీ జితేందర్ సింగ్ మీనా వివరించారు. కాగా శనివారం ఏడుగురు ఎస్టీఎఫ్ జవాన్లను హతమార్చిన మావోయిస్టులు, మృతదేహాల కోసం వెళ్ళిన జవాన్లపై ఆదివారం కూడా దాడి చేసి 17 వాహనాలకు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే.