: ఇదేమి గోల?... కేజ్రివాల్ పై ఢిల్లీ ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన సమీక్షలు నిర్వహించే తీరును నిరసిస్తున్నారు. సాధారణంగా వారాంతంలో వివిధ శాఖల పనితీరుపై ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకూ సమీక్షలు జరుగుతాయి. ఆ సమయంలో సమీక్షల వల్ల పలు ఆఫీసు కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోందంటూ, కేజ్రివాల్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఉదయం 10 గంటలకు కార్యాలయాలకు వచ్చిన అధికారులు రాత్రి 10 గంటలు దాటేవరకూ ఆఫీసుల్లో ఉండాల్సి వస్తోంది. దీంతో అధికారులు 'ఇదేమి గోల?' అంటూ, ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.