: మరింత వర్షం, నష్టం పొంచి ఉంది... తస్మాత్ జాగ్రత్త!


వచ్చే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. నార్త్ కర్నాటక నుంచి కేరళ మీదుగా కొమరిన్ వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా ఉందని, దీనికి తోడు ఉపరితల ద్రోణి కూడా చురుగ్గా కదులుతోందని తెలిపింది. క్యుములో నింబస్ మేఘాలు సైతం ఏర్పడవచ్చని పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురవచ్చని వివరించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, రాయలసీమ, తెలంగాణల్లో వడగళ్ల వానలు పడే ప్రమాదం ఉందని, పంట నష్టం వాటిల్లవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News