: చిన్న కుటుంబం అంటే... జాతికి చింతలే... నలుగుర్ని కనండి: తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు
'చిన్న కుటుంబం చింతలేని కుటుంబం' అనే అందమైన నినాదం పాటిస్తే, హిందూ జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని, ప్రతి హిందువూ నలుగురు పిల్లల్ని కనాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ అనగాని మంజులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఒకరు పది మంది పిల్లల్ని కంటుంటే, మరొకర్ని ఇద్దరు పిల్లలకే పరిమితం చేయాలని కోరడం ఎక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వంటి దేశభక్తుల చరిత్రను అందరికీ తెలియజేయాలని అన్నారు. స్వామిగౌడ్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.