: జర్మనీ ఇన్వెస్టర్లకు 80 పాయింట్లు చెప్పిన మోదీ
ఇండియాలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై జర్మనీ పారిశ్రామిక దిగ్గజాలకు భారత ప్రధాని మోదీ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇండియాలో మార్పు రావాల్సిన 80 అంశాలను ప్రస్తావించి, అందుకు సహకరించాలని కోరారు. డైమ్లర్, మెట్రో ఏజీ, బొంబార్డియర్, వోయిత్ తదితర 14 సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో మోదీ సమావేశం అయ్యారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని అభ్యర్థించిన ఆయన ఇక్కడి అవకాశాల గురించి వివరించారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి పెట్టుబడుల రాక విషయమై తానే స్వయంగా సమీక్షలు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. విదేశీ పెట్టుబడి నిబంధనలను సవరించమని, ఇకపై మరింత సులువుగా ఇన్వెస్ట్ చేయొచ్చని ఆయన హామీ ఇచ్చారు. భూసేకరణలో ఇబ్బందులు అధిగమించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నామని, దీనివల్ల పరిశ్రమలకు అవసరమయ్యే భూమి సమస్య కాబోదని తెలిపారు.