: సానియానా మజాకా... టెన్నిస్ డబుల్స్ లో నంబర్ 1


టెన్నిస్ లో శిఖరాగ్రానికి చేరుతూ, మహిళల డబుల్స్‌ లో హైదరాబాదీ సంచలనం సానియా మీర్జా నంబర్ 1 ర్యాంకు సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఒకప్పటి దిగ్గజం మార్టినా హింగిస్‌ తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్ సొంతం చేసుకున్న సానియా మహిళల టెన్నిస్ డబుల్స్ విభాగంలో శిఖరాగ్రానికి చేరి మకుటం లేని మహారాణిగా నిలిచింది. తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఇంతకుముందు పురుషుల డబుల్స్‌ లో భారత్ నుంచి లియాండర్ పేస్, మహేశ్ భూపతి కొంతకాలం నంబర్‌ వన్ ర్యాంక్‌ ను అనుభవించిన సంగతి తెలిసిందే. సానియా సాధించిన ఘనత పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News