: బుడతడి కంటపడ్డ డైనోసార్ శిలాజాలు
వందల సంఖ్యలో పరిశోధకులు ఏళ్ల తరబడి సోధించినా, వారి జీవితకాలంలో సాధించగలరన్న నమ్మకంలేని ఘనతను డల్లాస్ కు చెందిన ఐదేళ్ల చిన్నారి సొంతం చేసుకున్నాడు. డల్లాస్ 'జూ'లో పనిచేసే టిమ్ బ్రైస్ తన కుమారుడు విలీ బ్రైస్‌తో కలిసి సముద్ర జీవుల అవశేషాల కోసం వెతుకుతుండగా, విలీకి అరుదైన శిలాజం లభ్యమైంది. గత సంవత్సరం సెప్టెంబర్ లో బాలుడికి దొరికిన శిలాజం సుమారు 10 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన డైనోసార్ అవశేషంగా పరిశోధకులు ధ్రువీకరించారు. దీంతో స్పందించిన సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ పరిశోధకులు ఆ ప్రాంతంలో తవ్వకాలు జరపగా, మరిన్ని అవశేషాలు కంటబడ్డాయట.