: హోరువానతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం


ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. నిన్న కురిసిన వర్షాలకు చేతికందిన పంట చేజారిపోయే సమస్య ఉత్పన్నం కాగా, ఈరోజు వర్షాలకు మొత్తం పంటే ఊడ్చుకుపోయింది. ముఖ్యంగా తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో చేతికి రానున్న మామిడితో పాటు కల్లాల్లో నిల్వ ఉంచిన మిరప, మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వందలాది క్వింటాళ్ళ దిగుబడి వరుణుడి పాలయింది. హైదరాబాదులో పడిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు ప్రాంతాల్లో 3 అడుగుల మేర నీరు చేరింది. డ్రైనేజ్ వ్యవస్థ లోపాలు ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. పలు ప్రాంతాల్లో పాల సరఫరా నిలిచినట్టు తెలుస్తోంది. మరోవైపు తిరుమలలో పడిన భారీ వర్షానికి గుడి ముందు మోకాలి లోతున నీరు చేరింది.

  • Loading...

More Telugu News