: గవర్నర్లకు కేంద్రం ఆంక్షలు
తాము పనిచేస్తున్న రాష్ట్రాల్లో కాకుండా, ఇతర ప్రాంతాల్లో గవర్నర్లు ఎక్కువగా గడుపుతున్నారన్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. ఈ మేరకు రాష్ట్రాల గవర్నర్లకు కేంద్రం పలు ఆంక్షలు విధించింది. ఏడాదిలో 292 రోజులు గవర్నర్లు తాము పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే ఉండాలని ఆదేశించింది. గవర్నర్లు తాము పనిచేస్తున్న రాష్ట్రం విడిచి వెళ్లాలంటే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఏదయినా పని నిమిత్తం రాష్ట్రం వదిలి వెళ్లాలంటే రాష్ట్రపతి, ప్రధాని, ప్రిన్సిపల్ సెక్రటరీ, కేంద్ర హోం మంత్రికి ముందస్తు సమాచారం అందించాలని గవర్నర్లకు కేంద్రం స్పష్టం చేసింది.