: టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ 44/0


ఐపీఎల్ సీజన్-8లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ బ్యాటింగ్ ప్రారంభించింది. రంజీ ప్లేయర్లైన శ్రేయస్ అయ్యర్ (6), మయాంఖ్ అగర్వాల్ (33) బ్యాటింగ్ ప్రారంభించారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతుండడంతో ఢిల్లీ జాగ్రత్తగా ఇన్నింగ్స్ ఆరంభించింది. మయాంఖ్ అగర్వాల్ వీలు చిక్కినప్పుడల్లా బంతులను బౌండరీ దాటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ డేర్ డెవిల్స్ వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News