: ఐపీఎల్ లో నేడు డీడీ వర్సెస్ ఆర్ఆర్, ఎమ్ఐ వర్సెస్ పంజాబ్ 'ఢీ'


ఐపీఎల్ సీజన్-8లో నేడు రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు సాయంత్రం నాలుగు గంటలకు తలపడనుండగా, సాయంత్రం 8 గంటలకు ముంబై ఇండియన్స్ జట్టు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ను ఢీ కొట్టనుంది. నాలుగు జట్లలోనూ పెద్ద ఆటగాళ్లుండడానికి తోడు మూడు జట్లు పాయింట్ల ఖాతా తెరవలేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రమే ఒక విజయం నమోదు చేసింది. దీంతో నేడు జరగనున్న పోటీలో అన్ని జట్లు విజయమే లక్ష్యంగా ప్రదర్శన చేయాలని భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నేడు జరుగనున్న మ్యాచ్ లు రసవత్తరంగా సాగనున్నాయి.

  • Loading...

More Telugu News