: నేతాజీ వరకు ఎందుకు, నాపై కూడా నిఘా ఉండేది!: శరద్ పవార్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబంపైనే కాదు, తనపై కూడా నిఘా ఉండేదని ఒకప్పటి కాంగ్రెస్ నేత, ప్రస్తుత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బాంబు పేల్చారు. నేతాజీ కుటుంబంపై సుదీర్ఘకాలం నిఘా ఉంచారన్న వార్తలు కలకలం రేపిన నేపథ్యంలో, ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాను మహారాష్ట్ర హోం మంత్రిగా విధులు నిర్వర్తించినప్పుడు తనపై నిఘా ఉండేదని ఆయన చెప్పారు. అయితే ఇలా నిఘా ఉంచడం ప్రభుత్వాలకు కొత్తకాదని, అన్ని ప్రభుత్వాలు నిఘా ఉంచేవని ఆయన చెప్పారు.