: ఒక మిస్డ్ కాల్... వారి జీవితాన్నే మార్చేసింది!


ఖమ్మం జిల్లా మధిరకు చెందిన, డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న వేణు అనే విద్యార్థి తన మొబైల్ నుంచి పొరపాటున డయల్ చేసిన నెంబర్ తప్పని గుర్తించి వెంటనే కట్ చేశాడు. ఆ కాల్ తన జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు అతనికి తెలియదు. ఆ కాల్ భర్తను కోల్పోయి పిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న ఇల్లెందుకు చెందిన యువతి రమకు వెళ్ళింది. మిస్డ్ కాల్ చూసుకున్న రమ తిరిగి వేణుకు కాల్ చేసింది. దాంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఓ రోజు రమ ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్ళిన వేణును ఆమె అత్తమామలు, బస్తీవాసులు నిర్బంధించారు. సీన్లోకి వచ్చిన పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించడంతో, తాము వివాహం చేసుకుంటామని అంగీకరించారు. దీంతో శాంతించిన ఊరి పెద్దలు సమీపంలోని సమ్మక్క దేవాలయంలో ఇద్దరికీ వివాహం జరిపించారు.

  • Loading...

More Telugu News